BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 10:15 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
25 Sep, 2026 - 10:15 AM
18 వీక్షణలు

ఆత్రేయపురం: వీఆర్ఎల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్రేయపురం మండలంలో వీఆర్ఎలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 9వ రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వీఆర్ఎలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పర్తి లోవరాజు, కార్యదర్శి పాములు ప్రసాద్ ఆధ్వర్యంలో వీఆర్ఎలు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు.

చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని వీఆర్ఎలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

వీఆర్ఎలందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, ప్రస్తుతం నామినీలుగా పనిచేస్తున్న వారిని నిబంధనల ప్రకారం వీఆర్ఎలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఎలకు 90 శాతం ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని కోరారు.

విధి నిర్వహణలో ఉండగా మరణించిన వీఆర్ఎల కుటుంబాల్లో వయోపరిమితిని పరిగణనలోకి తీసుకోకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చి, తక్షణమే చర్యలు చేపట్టాలని వీఆర్ఎలు కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.