BREAKING
thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:17 pm
Posted by : కూనురు మధు

ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
31 Oct, 2026 - 07:17 PM
21 వీక్షణలు

దేశ ఐక్యత, సమగ్రతకు ఆమె చేసిన కృషి మరువలేనిది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

NTODAY NEWS: చిట్యాల

భారత మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం చిట్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ అభివృద్ధికి ఆమె అందించిన సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాసు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.