BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 06:35 pm
Posted by : K MAHESH

జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 06:35 PM
14 వీక్షణలు

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

జర్నలిస్టులను విడదీసి చూడకుండా అందరికీ సమానంగా ఇళ్ల స్థలాలు కల్పించాలి: దాడుల నియంత్రణ కమిటీ కన్వీనర్ బేతమల్ల సహదేవ్

మహబూబాబాద్ జిల్లా | కురవి | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కురవి మండల కేంద్రంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను జర్నలిస్టులు కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా దాడుల నియంత్రణ కమిటీ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ మాట్లాడుతూ జర్నలిస్టులందరినీ సమానంగా చూడాలని, సంఘాలు లేదా ఇతర విభేదాల ఆధారంగా విడదీసి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పి కాలయాపన చేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చొరవ తీసుకుని జర్నలిస్టుల చిరకాల కోరికను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల కుటుంబాలు, వారి పిల్లలు సొంత ఇంటి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సహదేవ్ తెలిపారు. తమకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేయాలనే ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల కన్వీనర్ గుంటి సురేష్, జిల్లా కమిటీ సభ్యులు అనుగోజు పూర్ణచంద్రరావు, ఆమేడ శ్రీధర్, సంఘం నాగరాజు, భరతపురపు వీరన్న, దూదికట్ల రవీంద్రాచారి, పొన్నెబోయిన వెంకన్న, డమాల రోశయ్య, నిలుగొండ రాజు, సంతోష్, మడ్డి వీరన్న, దుండ్ర నిర్మల తదితరులు పాల్గొన్నారు.