BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 07 February 2026, 09:58 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సర్కార్ బడికి ‘ఇంటర్ నెట్’ వస్తోంది

తెలంగాణ
07 Feb, 2026 - 09:58 PM
342 వీక్షణలు
సర్కార్ బడికి ‘ఇంటర్ నెట్’ వస్తోంది జూన్ నాటికి మరో 6,307 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం NTODAY NEWS: హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ మౌలిక వసతులను విస్తరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్తగా 8,956 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇందులో భాగంగా గత రెండు నెలల్లోనే 2,649 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రారంభమైంది. మిగిలిన 6,307 పాఠశాలలకు జూన్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో ఒప్పందాలు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు విద్యాశాఖ బీఎస్ఎన్ఎల్ (BSNL), టీ-ఫైబర్ (T-Fiber) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 8,956 పాఠశాలల్లో: 5,354 పాఠశాలలకు డిజిటల్ భారత్ నిధుల కింద బీఎస్ఎన్ఎల్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ 674 పాఠశాలలకు టీ-ఫైబర్ విభాగం ఉచితంగా నెట్ సదుపాయం ఈ విధంగా 6,028 పాఠశాలలకు ఎలాంటి చార్జీలు లేకుండా ఇంటర్నెట్ అందనుంది. చెల్లింపు ప్రాతిపదికన మరో 2,928 పాఠశాలలు మిగిలిన 2,928 ప్రభుత్వ పాఠశాలలకు చెల్లింపు ప్రాతిపదికన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఒప్పందాలు జరిగాయి. బీఎస్ఎన్ఎల్: నెలకు పాఠశాలకి రూ.599 టీ-ఫైబర్: నెలకు పాఠశాలకి రూ.900 జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర స్థితి ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో రాష్ట్రం గతంలో జాతీయ సగటుతో పోలిస్తే వెనుకబడి ఉంది. 2023–24 విద్యా సంవత్సరం జాతీయ సగటు: 50.5% రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు: 21.90% 2024-2025 జాతీయ సగటు జాతీయ సగటు: 58.60% రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉన్న పాఠశాలలు: 52.90% కొత్తగా 8,956 పాఠశాలలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ర్యాంకు జాతీయ స్థాయిలో మెరుగుపడనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల పరిధిలో మొత్తం 30,038 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలకు డిజిటల్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube