BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 25 August 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇరుముడి సినిమాపై వివాదం....

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:39 PM
127 వీక్షణలు

ఇరుముడి’ సినిమాపై వివాదం.. వివాదాస్పద సన్నివేశాలు తొలగించాలని ఏపీటీఎఫ్ డిమాండ్

‘రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదలైన వెంటనే మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుండగా.. మరోవైపు అనుకోని వివాదంలో చిక్కుకుంది.

ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసేలా చిత్రీకరణ చేయడం సరికాదని, వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది.

ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. సినిమాలో ఉపాధ్యాయుడి పాత్రను ప్రతికూలంగా చూపించారని ఆరోపించారు. ముఖ్యంగా ఉపాధ్యాయురాలి పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో కనిపించే పాఠశాల, విద్యార్థుల దుస్తులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను పోలి ఉండటం అభ్యంతరకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉండటం బాధాకరమని అన్నారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.

సినిమా యూనిట్ వెంటనే స్పందించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై సెన్సార్ బోర్డు, సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.