BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 May 2026, 10:05 am
Posted by : BATHULA VENKATESH

పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
23 May, 2026 - 10:05 AM
66 వీక్షణలు

“షైనింగ్ స్టార్” కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ “షైనింగ్ స్టార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రత్యేక మొమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారికి, అలాగే విద్యార్థులు ఈ స్థాయి విజయాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థకు కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, సాంకేతికత ఆధారిత విద్యా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకెళ్తున్నాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుండటం ఆనందదాయకమని, భవిష్యత్తులో విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.