BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:17 PM
56 వీక్షణలు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు రానున్నాయి. ఇకపై ఒక పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను అదే పాఠశాల ఉపాధ్యాయులు కాకుండా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షలు, పదో తరగతి ఎస్‌ఏ-1 పరీక్షల జవాబు పత్రాలకు ఈ విధానం వర్తించనుంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో ప్రత్యేక మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేంద్రాల్లో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జవాబు పత్రాలను పరిశీలించనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.