BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 10:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జానకి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పీవీ సునీల్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 10:24 PM
181 వీక్షణలు

జానకి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పీవీ సునీల్ కుమార్

చింతలపూడి: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, పార్టీకి విశేష సేవలందించిన జానకి రెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ రిటైర్డ్ డీజీ పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. జానకి రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జానకి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన పీవీ సునీల్ కుమార్, జానకి రెడ్డి ప్రజలతో మమేకమై పార్టీకి, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, తనకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు జానకి రెడ్డి ఎల్లప్పుడూ ముందుండేవారని పేర్కొన్నారు. ఆమె సేవాభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత చిరస్మరణీయమని అన్నారు.

జానకి రెడ్డి ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే వారికి తీరని లోటని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు కాకర్ల సత్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జానకి రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.