BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు మంత్రి కొలుసు పార్థసారధి అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 07:29 AM
44 వీక్షణలు

జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు మంత్రి కొలుసు పార్థసారధి అభినందనలు

నూజివీడు/ఏలూరు, జూలై 19: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన విజేతలందరికీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఉత్తమ చిత్రాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందాలకు ఈ అవార్డులు దక్కడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పుష్ప–2, కల్కి, లక్కీ భాస్కర్, అమరన్, కమిటీ కుర్రోళ్లు తదితర చిత్రాలకు జాతీయ అవార్డులు లభించడం చిత్ర బృందాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆనందదాయకమని అన్నారు.

భవిష్యత్తులో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రతిభను మరింత చాటాలని, వచ్చే ఏడాది మరిన్ని జాతీయ అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.