BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 22 March 2026, 12:26 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 Mar, 2026 - 12:26 PM
160 వీక్షణలు

జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.తాజాగా జిల్లా డీసీసీ కమిటీలను ప్రకటించిన అనంతరం, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనల ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చర్యలు చేపట్టనున్నారు.ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై సమీక్ష చేపట్టనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసి, భవిష్యత్ ఎన్నికల దిశగా పటిష్ట కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.జిల్లాల పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.