BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 24 June 2026, 06:54 pm
Posted by : V శ్రీనివాస్

జిల్లాలో 32 తాత్కాలిక గురుకుల టీచర్ పోస్టుల భర్తీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:54 PM
396 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 32 తాత్కాలిక ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు (బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు స్త్రీలు మాత్రమే అర్హులు). విద్యా అర్హతల విషయానికొస్తే.. జూనియర్ లెక్చరర్ (JL), పీజీటీ (PGT) పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ డిగ్రీతో పాటు బి.ఎడ్ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ (TGT) పోస్టులకు కనీసం 50% మార్కులతో డిగ్రీ (B.Sc/BA/B.Com) మరియు బి.ఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

​అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో జూన్ 27న (శనివారం) లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ధృవపత్రాల పరిశీలన, అనంతరం డెమో (తరగతి బోధన) ఉంటుందని జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి కోటూరి రామకల్యాణి తెలిపారు. ఇతర వివరాలకు 9704550167 నంబరును సంప్రదించవచ్చు