BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 24 June 2026, 06:53 pm
Posted by : V శ్రీనివాస్

​జిల్లాలోని ఎస్.సి. న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:53 PM
268 వీక్షణలు

జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్

​మంచిర్యాల: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులకు శిక్షణ భృతి, ఇతర సదుపాయాల కల్పనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను 39 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన ఎస్సీ లా గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి, న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం మూడు సంవత్సరాల పాటు జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ. 3,000 చొప్పున శిక్షణ భృతి అందించడంతో పాటు.. న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకేసారి రూ. 50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

​ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బార్ అసోసియేషన్‌లో తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. అలాగే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులైతే రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంత వాసులైతే రూ. 2 లక్షల లోపు ఉండాలి. అర్హత గల వారు జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా 'తెలంగాణ ఈ-పాస్' (https://telanganaepass.cgg.gov.in) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ-సేవా ద్వారా జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్‌ను, సంబంధిత ధ్రువపత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (IDOC)లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాలకు పనివేళల్లో తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన సూచించారు