BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 24 June 2026, 06:57 pm
Posted by : V శ్రీనివాస్

​మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:57 PM
164 వీక్షణలు

​మంచిర్యాల :విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, సమాజంలో ఇతరులను కూడా చైతన్యపరచాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున గుడిపేట మెడికల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు వాటి దుష్ప్రభావాల పట్ల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల పట్ల యువత అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

​ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ రవీందర్, ఎస్సై కిరణ్, ఎక్సైజ్ డిఎస్పి రాంరెడ్డి, దేవ రావుఫ్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు