BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 24 June 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శింగణమలలో వైఎస్సార్సీపీ జోరు.. టీడీపీకి షాక్

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 07:32 PM
128 వీక్షణలు

అనంతపురం జిల్లా శింగణమల నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సింగణమల మండలం రాచేపల్లి గ్రామానికి చెందిన 13 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగినట్లు నాయకులు తెలిపారు.

మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ నేతృత్వంలో, యువ నాయకుడు డాక్టర్ రుత్విక్ సమక్షంలో, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి గోకుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడిగా ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో వైఎస్సార్సీపీ పాత్రను గుర్తించి పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

రానున్న రోజుల్లో శింగణమల నియోజకవర్గంలో మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.