BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు పీఎం శ్రీ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ తిరువూరు విద్యార్థినులు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 08:25 PM
57 వీక్షణలు

తిరువూరు: తిరువూరు నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ (తిరువూరు) విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ నెల 28న గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో వాలీబాల్, యోగ, ఖోఖో విభాగాల్లో విద్యార్థినులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల, ప్రథమ సహాయ ఉపాధ్యాయురాలు కె. లావణ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థినులకు సమర్థవంతంగా శిక్షణ అందించిన పీడీలు బి. జయలక్ష్మి, జి. సుకన్యలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

జిల్లాస్థాయి పోటీల్లో కూడా ఇదే జోరు కొనసాగించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి పాఠశాలకు, తిరువూరుకు మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయురాలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థినుల విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.