BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 01 July 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జిందాల్ స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి యత్నం: వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
111 వీక్షణలు

రేపు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ బృందం

జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని గురువారం వైఎస్సార్సీపీ బృందం సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి  జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని, అప్పటి ప్రభుత్వం 3,500 ఎకరాల భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత జిందాల్ యాజమాన్యం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు.

జూలై 3న మరోసారి జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి  సిద్ధమవుతున్నారని, 2018లో కూడా స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిందాల్ స్టీల్స్ పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ బృందం గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనుంది. చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.