BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

విశిష్ట సేవలందించిన డీఆర్వో భీమిరెడ్డి శివ నారాయణ రెడ్డికి ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 01:32 PM
90 వీక్షణలు

భీమవరం జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్వో)గా సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన భీమిరెడ్డి శివ నారాయణ రెడ్డికి భీమవరంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడంలో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడంలో, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి భీమిరెడ్డి శివ నారాయణ రెడ్డి అందరి మన్ననలు పొందారని అన్నారు. ప్రభుత్వ సేవలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారని, ఆయన సేవలు ప్రభుత్వ యంత్రాంగానికి, భావితర అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమం, సుపరిపాలన, పారదర్శక పాలనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే తెలుగుదేశం పార్టీ సమర్థతతో పనిచేసే అధికారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, అలాంటి సేవామూర్తులను గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు.

ఈ సందర్భంగా భీమిరెడ్డి శివ నారాయణ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతర జీవితం సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, కుటుంబ ఆనందాలతో నిండిపోవాలని, భవిష్యత్తులోనూ ఆయన అనుభవం, మార్గదర్శకత్వం సమాజానికి అందాలని ఆకాంక్షించారు.