BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జలధారతో జలకళ సంతరించుకున్న ఏపీ పల్లెలు.. కరవు నేలల్లో పచ్చని విప్లవం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:40 PM
141 వీక్షణలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జలధార ప్రాజెక్ట్’ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తోంది. ఒకప్పుడు నీటి కొరతతో అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా కరవు బారిన పడిన అన్నమయ్య జిల్లా దుబిగన్పల్లి, ప్రకాశం జిల్లా మురుగుమ్మి, మారెళ్ల, తాంగేళ్ల గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ ఆశాజ్యోతి నింపింది.

స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు విశేష ఫలితాలు ఇస్తున్నాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతాల్లో చేపట్టిన 195 నీటి సంరక్షణ పనుల ద్వారా సుమారు 24 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడింది. దీంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగి, దాదాపు 5,900 మంది గ్రామస్తులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు.

పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందడంతో పంటలు పచ్చగా పెరుగుతుండగా, పశువులకు కూడా తాగునీటి సమస్య తీరింది. ఒకప్పుడు ఎండిపోయిన బోర్లు, వెలవెలబోయిన చెరువులు కనిపించిన ప్రాంతాల్లో ఇప్పుడు నీటి నిల్వలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, వ్యవసాయ రంగం కొత్త ఊపుతో ముందుకు సాగుతోంది.

జలధార ప్రాజెక్ట్‌తో కరవు నేలలు సస్యశ్యామలంగా మారి, ఏపీ పల్లెలు పచ్చదనంతో కొత్త చరిత్ర రాస్తున్నాయి.