BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 24 June 2026, 11:28 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 11:28 PM
101 వీక్షణలు

రూ. 6.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ 

అన్నమయ్య జిల్లా మదనపల్లి క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అంతర్రాష్ట్ర స్థాయిలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మంగళవారం మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కేసు వివరాలను వెల్లడించారు.

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన షేక్ ఖజాపిర్ (30). వృత్తిరీత్యా పెయింటర్ అయిన ఇతనికి పెద్ద కుటుంబం ఉండటం, ఆదాయం చాలకపోవడంతో పాటు క్రికెట్ బెట్టింగ్లకు బానిసై చోరీల బాట పట్టాడు.

జూన్ 23 ఉదయం చిన్నమండెం మండలం, వండాడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడుపట్టుబడ్డాడు.

రికవరీ చేసిన సొత్తు: చిన్నమండెం, కలకడ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన రూ.6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల విలువైన 250 గ్రాముల వెండి వస్తువులు మరియు ఒక స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేర చరిత్ర: నిందితుడిపై గతంలో అనంతపురం జిల్లాలో 20, కర్ణాటకలో 10, అన్నమయ్య జిల్లాలో 10 పాత కేసులు ఉన్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో నమోదైన 7 కేసుల్లో ఇతనే ప్రధాన ముద్దాయి.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి గారు పలు కీలక సూచనలు చేశారు..

యువత క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ జూదాలు వంటి జల్సాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ నేరాల వైపు అడుగులు వేయిస్తుంది.

వేసవి సెలవులు లేదా ఇతర పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారంఅందించాలి.

దొంగతనాలను నివారించడానికి ప్రతి కాలనీ, వీధుల్లో, వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

మీ పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా