BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 04:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనవిజ్ఞాన వేదిక వైద్య శిబిరానికి విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 04:59 PM
130 వీక్షణలు

జనవిజ్ఞాన వేదిక వైద్య శిబిరానికి విశేష స్పందన

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నాగార్జున పాఠశాలలో నిర్వహిస్తున్న బీపీ, షుగర్, ఫిట్స్ రెగ్యులర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వైద్య శిబిరానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి 950 మంది హాజరయ్యారు.

శిబిరానికి వచ్చిన వారికి రెండు నెలలకు సరిపడ మందులను కేవలం రూ.200కే అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బీపీ, షుగర్ వ్యాధులు కేవలం మందులతోనే నియంత్రణలోకి రావని, సరైన ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

వరి, గోధుమ వంటి ఆహార పదార్థాలను ఒక పూటకే పరిమితం చేసి రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ వైద్య శిబిరంలో వైద్యులు డాక్టర్ రవీంద్ర, డాక్టర్ చి. రాహుల్, డాక్టర్ శివాజీతో పాటు మదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ విద్యార్థులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు యం. హరికృష్ణ, కె. పాపారావు, కె. లక్ష్మణరావు, రాజశేఖరరెడ్డి, ఆంజనేయులు, ప్రతాపరెడ్డి, యం. నాగేంద్ర ప్రసాద్, చి. శ్రీను, సురేష్ తదితరులు సేవలు అందించారు.