BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 10 May 2026, 12:53 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జోసెఫ్ విజయ్ అను నేను...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 May, 2026 - 12:53 PM
245 వీక్షణలు

Joseph Vijay తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పుంగనూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయూబ్ భాష ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల నాయకులతో కలిసి స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి, బాణాసంచాలు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయ కోటలను ఛేదిస్తూ భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన పోరాట యోధుడు జోసెఫ్ విజయ్ గారికి అభినందనలు తెలిపారు. సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ప్రజల హృదయాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు.

డబ్బు, అధికారం కాకుండా ప్రజల ప్రేమ, విశ్వాసంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన మీరు యువతకు, సాధారణ ప్రజలకు ఆశాకిరణంగా మారారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలని ఆకాంక్షించారు.

“చరిత్రలో ఒక్కడు… ప్రజల మనసుల్లో నిజమైన హీరో”గా నిలిచిన విజయ్ గారు రాజకీయాల్లో కూడా కొత్త ప్రమాణాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో Communist Party of India పార్టీ సహాయ కార్యదర్శి మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్తాఫ్, ముబారక్, ఫయాజ్, అజ్మత్, షాహిద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, CPI నాయకులు తదితరులు పాల్గొన్నారు.