BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 03:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 03:18 PM
69 వీక్షణలు

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయాలి: ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజాద్

చింతలపూడి:

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) గత 70 ఏళ్లుగా నిరంతరం పోరాడుతోందని ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్‌కే అజాద్ తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం చింతలపూడి యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లపై చింతలపూడి డిప్యూటీ తహసిల్దార్ షేక్ షకీలాకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం పత్రికా రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న చింతలపూడి సీనియర్ పాత్రికేయుడు మాదాసు పుల్లారావును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అజాద్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

అలాగే విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సభ్యులు కె.ఎస్.ఎస్. వీరయ్య, అమీర్ పాషా, ఖలీల్, జి. నాగేశ్వరరావు, కె. కృపావరం, రజినీ, సంజయ్, బాలు, నరేష్, నాగేంద్ర, సత్యనారాయణ, ప్రసాద్, నదీమ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.