www.ntodaynews.com
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ ఏఈఓ రవీంద్రబాబు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యుడు శివప్రసాద్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.