BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 31 July 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంగనా రనౌత్ వ్యాఖ్యలు గర్హనీయం: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 06:24 AM
111 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: ఢిల్లీలో నీట్ పరీక్షల కుంభకోణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడిన విద్యార్థి ఉద్యమాన్ని, జన్ జీ నాయకత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విమర్శించారు. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, ప్రజా వ్యతిరేక విధానాలను దేశ ప్రజల ముందు బహిర్గతం చేయడంలో జన్ జీ ఉద్యమం విజయవంతమైందన్నారు. నీట్ కుంభకోణం కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి "చలో పార్లమెంట్" ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్‌లతో దాడులు చేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జలియన్‌వాలా బాగ్ ఘటనను గుర్తు చేసిందని హరినాథ్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. నీట్ కుంభకోణానికి బాధ్యత లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ పరిణామాలతోనే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఉద్యమకారులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను "గట్టర్ జనరేషన్", "మురికి కాలువల తరం" అంటూ కించపరిచినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం మానుకోవాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి, ప్రజల్లో చైతన్యం కలిగించాయని హరినాథ్ అన్నారు. 

చివరగా, ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.