BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 07:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:26 AM
52 వీక్షణలు

కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!

అక్రమ చెరువులు.. అడ్డగోలు వ్యవహారాలు..!

కొల్లేరు ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న చేపల చెరువుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. పని చేయించుకుని కూలీలకు కూలీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

మూడు రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వాలని కోరుతూ బాధిత కూలీలు సంబంధిత యజమానుల గేటు ముందు పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కూలీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, “ఎక్కడైనా వెళ్లి చెప్పుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చెరువుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

పని చేయించుకుని చేతులు దులుపుకున్న యజమానులపై వెంటనే చర్యలు తీసుకుని తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, కొల్లేరు అక్రమ చెరువుల వెనుక జరుగుతున్న అసలు వ్యవహారమేంటనే దానిపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం మరోసారి పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. కూలీలకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.