కోడూరులో పైడిమర్రి వెంకట సుబ్బారావుకు ఘన నివాళులు
ఏ.కొండూరు: భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు చిత్రపటానికి విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్ర రచయిత యం. రాం ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావం, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందించడంలో భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవం, బాధ్యతా భావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బి. నాగేంద్ర రావు, వి. తేజస్విని, వి. జయశ్రీ, టీ. సుప్రియతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.