BREAKING
thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
Date of Publish : 17 September 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ భవనాల స్థలాల ఆక్రమణపై పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Sep, 2026 - 07:05 PM
25 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెంలో వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ భవనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో చనుబండ-2 సచివాలయ అధికారులు కే. శాంతి (ఎంఎల్‌హెచ్‌పీ), ఎం. కోటి (డీఏ), ఆర్. బాబురావు (డబ్ల్యూఈఏ) సూరంపాలెంలో సంబంధిత స్థలాన్ని పరిశీలించారు.

వెల్నెస్ సెంటర్ పక్కన నిర్మాణంలో ఉన్న బాత్రూమ్ వెనుక భాగంలో వరల గోతిని తవ్వించారు. వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ భవనాలు నిర్మించిన ప్రభుత్వ స్థలం చుట్టుపక్కల కూడా ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు నక్కా రాము తెలిపారు.

ప్రభుత్వ భవనాల కోసం కేటాయించిన స్థలాన్ని మండల రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించి, వెల్నెస్ సెంటర్, అంగన్వాడీతో పాటు భవిష్యత్‌లో వైద్య, ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని నక్కా రాము అధికారులను కోరారు.