BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

కర్నూల్ మన ఊరు - మన జెండా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 09:16 PM
197 వీక్షణలు

కర్నూల్  మన ఊరు - మన జెండా కార్యక్రమంలో @47  సంవత్సరాలు@ బీజేపీ  జెండాను ఆవిష్కరించిన మాజి రాజ్య సభ సభ్యులు T G వెంకటేష్  

కర్నూల్లో  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మన ఊరు... మన జెండా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు, బిజెపి నేత టీజీ వెంకటేష్ హాజరై బిజెపి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో బిజెపి నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పార్లమెంటులో ఒక స్థానంతో మొదలై ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని అన్నారు. భారతదేశ గౌరవాన్ని ప్రపంచం నలుమూలల పెంచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు .అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలలో చక్కగా పరిపాలిస్తున్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని దేశాభివృద్ధికి ఆయన పాటుపడుతున్నారని తెలియజేశారు. బిజెపి పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రహదారులను చూసినా.. మన సైనిక శక్తిని గమనించినా.... చంద్రమండలానికి వెళ్లే రాకెట్ల సామర్థ్యాన్ని పరిశీలించినా మన దేశ శక్తి ఏమిటో అర్థమవుతుందని తెలియజేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ దేశంలోని మైనార్టీల హక్కులను పరిరక్షిస్తూ పరిపాలన సాగిస్తుందని తెలియజేశారు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయులుగా గర్వపడాలని వివరించారు. దేశంలో ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు కృషి జరుగుతుందని, ఈ క్రమంలో ఎవరైనా దేశద్రోహులు దేశం ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే వారి పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ దేశద్రోహులను శిక్షిస్తుందని తెలియజేశారు. మనదేశంలో ఉన్న  మైనార్టీలు హిందువులను చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే హిందూ సామాజిక వర్గంలో మతమార్పిడిల ప్రస్తావన లేదన్నారు. బిజెపిని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.