BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 26 January 2026, 04:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అభివృద్ధి పథంలో కరీంనగర్

తెలంగాణ
26 Jan, 2026 - 04:41 AM
289 వీక్షణలు
అభివృద్ధి పథంలో కరీంనగర్: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్  రాజ్యాంగ ఆదర్శాల సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక పాలనలో కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ముందంజ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం: జిల్లాలో 6.33 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లక్షన్నర మందికి పైగా లబ్ధి పొందారు. గృహజ్యోతి పథకం: 1.71 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు జీరో బిల్లులు అందుతున్నాయి. రైతు భరోసా – రుణమాఫీ: రూ.622 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయగా, రైతు భరోసా కింద రూ.206 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో వినూత్న మార్పులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బ్రిక్స్ టు బుక్స్, విద్యా వాహిని వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వలస కూలీల పిల్లల కోసం ప్రత్యేక తరగతులు, విద్యార్థులకు ఉచిత డెంటల్ క్యాంపులు ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య రంగంలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 3.17 లక్షల మందికి పైగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. పేదరిక నిర్మూలన, శాంతిభద్రతలు ఇందిరమ్మ ఇండ్లు: అర్హులైన 11,575 మందికి ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే రూ.128.88 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. మహిళా సాధికారత: స్వయం సహాయక సంఘాలకు రూ.684 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన పోలీస్ యంత్రాంగం, అధికారులను కలెక్టర్ అభినందించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి పాఠశాలలో కాన్షియస్నెస్ క్లబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. #Karimnagar #RepublicDay77 #DistrictDevelopment #PamelaSatpathy #WelfareSchemes #WomenEmpowerment #EducationReforms #HealthcareInitiatives #TelanganaDevelopment Follow us on Website Facebook Instagram YouTube