BREAKING
thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి
Test 4
Date of Publish : 22 November 2026, 09:13 pm
Posted by : MUSUGU GOPI

నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వదీపోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
22 Nov, 2026 - 09:13 PM
8 వీక్షణలు

కార్తీక పౌర్ణమి గరుడ సేవ రద్దు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దీపోత్సవం.. గరుడ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు

తిరుమల, నవంబర్ 23:

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం ఈ దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయ పరిసరాల్లో నేతి వత్తులతో దీపాలను వెలిగించనున్నారు. ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ దీపాలను ఊరేగింపుగా తీసుకెళ్లి విమాన ప్రదక్షిణం నిర్వహించిన అనంతరం ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పిస్తారు.

ఆ తర్వాత ఆలయంలోని వివిధ సన్నిధులు, మండపాలు, ప్రదేశాల్లో దీపాలను ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను వెలిగించనున్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న పర్వదీపోత్సవం నేపథ్యంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున నిర్వహించే శ్రీవారి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా కార్తీక దీపోత్సవం కారణంగా ఆ రోజు నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.