BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 March 2026, 04:39 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఖమ్మంలో పేద కుటుంబానికి ఇల్లు – సీఎం ఏ. రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 04:39 PM
192 వీక్షణలు

ఖమ్మం: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై వెలువడిన కథనానికి ఆయన తక్షణమే స్పందించారు.

​కథనం వెనుక ఉన్న బాధ:

గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు సరైన నివాసం లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.

​సీఎం ఆదేశాలతో తక్షణ సహాయం:

ఈ పరిస్థితిపై చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జిల్లా కలెక్టర్ స్పందించి, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామానికి పంపించారు. అధికారుల బృందం రమేష్–సులోచన దంపతులను కలిసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు.

​తమ గోడును ఆలకించి, తక్షణమే గూడు కల్పించిన ముఖ్యమంత్రికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం సామాన్యుల పక్షాన ఉందనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు.