BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:10 pm
Posted by : M. రాజశేఖర్

Kuppam: గ్రామీణ విద్యార్థుల క్రీడా ప్రతిభకు కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేయూత

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
02 Nov, 2026 - 04:10 PM
15 వీక్షణలు

గ్రామీణ విద్యార్థుల క్రీడా ప్రతిభకు కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేయూత

ప్రభుత్వ రూరల్ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.60 వేల విలువైన స్పోర్ట్స్ కిట్ అందజేత

కుప్పం (ఎన్‌ టుడే న్యూస్‌): గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరో సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డా. వై.సి. జేమ్స్ ఎన్. ప్రభుత్వ రూరల్ పాలిటెక్నిక్ కళాశాలకు సుమారు రూ.60 వేల విలువైన స్పోర్ట్స్ కిట్‌ను అందజేసింది.

కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున కుప్పం ఇంజినీరింగ్ కళాశాల వైస్‌ చైర్మన్‌ డా. ఎన్. సునీల్ రాజ్ క్రీడా సామగ్రిని కళాశాల ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని అలవరిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తగిన క్రీడా సదుపాయాలు కల్పిస్తే వారిలోని ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుందని తెలిపారు.

కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ దూరదృష్టి, సేవాభావం, విద్యాభివృద్ధి పట్ల అంకితభావానికి ఈ కార్యక్రమం నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యాసంస్థల అభివృద్ధితో పాటు ఇతర విద్యాసంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డా. ఎస్. సుధాకరబాబు, డా. ఎం. జగన్నాధ రావు, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ సతీష్ కుమార్, పీఆర్వో ప్రవీణ్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.