BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:18 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కర్నూలు సివిల్ జడ్జి మల్లీశ్వరి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Nov, 2026 - 12:18 PM
22 వీక్షణలు

కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్న న్యాయమూర్తి.. తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థాన అధికారులు

చౌడేపల్లి, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొలువుదీరిన ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని కర్నూలు సివిల్ జడ్జి మల్లీశ్వరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం (08-11-2026) బోయకొండ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన ఆమెకు దేవస్థాన అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జడ్జి మల్లీశ్వరి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం పట్ల జడ్జి మల్లీశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన బోయకొండ క్షేత్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వివిధ ప్రాంతాల భక్తులను ఆకర్షిస్తున్న ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది.