BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 17 April 2025, 07:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భూభారతి చట్టం ద్వారా భూ సమస్య సత్వర పరిష్కారం

తెలంగాణ
17 Apr, 2025 - 07:34 AM
345 వీక్షణలు
భూభారతి చట్టం ద్వారా భూ సమస్య సత్వర పరిష్కారం-- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య NTODAY NEWS: ఆత్మకూరు మండలం, ఏప్రిల్ 17 భూభారతి చట్టం ద్వారా భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర పరిష్కార మార్గం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం పై ప్రజలకు అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఈ సందర్భంగా డా.బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.... భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వారి భూమి వారికి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టం గ్రామ గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని, గతంలో భూమి సమస్యలు గ్రామాలలో చాలా ఉండేవని ఆ సమస్యలు అధికారుల ద్వారా పరిష్కారం కాకపోతే కోర్టుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం అయ్యేది కాదని, ఇప్పుడు నిజమైన రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. మీ మీ గ్రామాలలో కూడా రైతులకు అవగాహన కల్పించి భూ సమస్యలు సులభతరంగా పరిష్కరించుకోవచ్చు అన్నారు. రైతులకు ప్రభుత్వం పెద్ద పీఠం వేసిందన్నారు. రైతుల భూ సమస్యలు మార్పులు చేర్పులు, మ్యుటేషన్, ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి గ్రామంలో భూ సమస్య లేని గ్రామాలుగా ఉండాలని దృఢ సంకల్పనతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందన్నారు. భూమి అంటే సర్వహక్కు భూమి యజమాన్యుడికి ఉండే విధంగా ఉండాలని దీన్ని ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చినందుకు అభినందనలను తెలిపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మనిషికి ఆధార్ మాదిరిగానే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భూధర్ కార్డులు ప్రభుత్వం అందిస్తుందన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ భూ సమస్య పై ఒక వ్యక్తి చేసుకున్న దరఖాస్తు దానిలో కబ్జా మాత్రం సగం సగం పంచుకున్నారని, పట్టా మాత్రం ఇతరుల పేరు మీద నమోదు అయిందని దాన్ని పరిష్కారం కు గతంలో చట్టం లేనందున కోర్టుకు పంపడం అక్కడ కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడం వంటి రకరకాల సమస్యలు ఉండేవని, ఇప్పుడు ధైర్యంగా భూభారతి చట్టం ద్వారా ఇబ్బందులు పోతాయని , భూభారతి అప్పిలేట్ అధికారిగా ఆర్డిఓ ఉంటారని ఏమైనా భూ సమస్యల పై అన్యాయం జరిగితే ఆర్డిఓ సవరించి చట్టం ద్వారా న్యాయం జరిగేలా చేస్తారన్నారు. భూభారతి రైతులకే ఒక ధైర్యం కాదని అధికారులకు కూడా భూ సమస్య పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఒక ధైర్యం అని కలెక్టర్ తెలిపారు. ప్రజలు భూ సమస్యల వల్ల కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరగకుండా ఏమైనా భూ సమస్య ఉంటే సులభతరంగా పరిష్కరించుకోవచ్చని , స్థానిక తహసిల్దార్ పరిధిలో కాకపోతే ఆర్డీవో పరిధిలో పరిష్కారం జరుపుతారని, ఆర్డీవో పరిధిలో కూడా పరిష్కారం కాకపోతే కలెక్టర్ స్థాయిలో పరిష్కరిస్తారని, కలెక్టర్ స్థాయి లో కూడా కాకపోతే సీసీఎల్ఏ ద్వారా పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ భూభారత్ చట్టం ద్వారా పేదలకు న్యాయం చేసే చట్టం తెచ్చినందుకు ప్రభుత్వంకు అభినందనలు తెలపాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. నిజమైన నిరుపేదలకు అన్ని రకాల భూ సమస్యలు శాశాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం ఉపయోగ పడుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పోవడానికి ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భూధార్ కార్డులు దశల వారిగా అందిస్తుందన్నారు. ప్రజలకు, రైతులకు నాలుగు భూములు ఉంటే నాలుగు భూధార్ కార్డులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామాలలో ప్రతి పేదవారికి ఈ చట్టం ద్వారా భూ సమస్య పోవడానికి ఈ చట్టం శాశ్వత చిరునామా అని అన్నారు. గ్రామాలలో రైతులు భూమి సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం ఆలోచన చేసి భూభారతి చట్టం ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా నియమాలు రూపొందించిందని అన్నారు.ఈ అవగాహన సదస్సులో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, సంబంధిత తహసిల్దార్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube