సిద్దినేనిగూడెంలో భూభారతి సర్వే
తెలంగాణ
/
ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్దినేనిగూడెం గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహించారు. తహసీల్దార్ రాంబాబు, గ్రామ సర్పంచ్ వేల్పుల వెంకటరావమ్మ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని భూములను సర్వే చేసి, ఆధునిక పరికరాల సహాయంతో భూముల కొలతలు చేపట్టారు. సంబంధిత భూ రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులందరూ తమ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, గ్రామ పెద్దలు, నాయకులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.