BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 08 March 2026, 01:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పంటలకు చివరి తడి నీరు విడుదల

తెలంగాణ
08 Mar, 2026 - 01:04 AM
230 వీక్షణలు
కేసీ కెనాల్ క్రింద ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కేసీ కెనాల్ క్రింద సాగు చేసిన ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల చేయాలని పాములపాడు మండల రైతులు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికు వినతి చేశారు. ఆదివారం పాములపాడు, ఎర్రగూడూరు, శాంతినగరం, కంబాలపల్లె, రుద్రవరం తదితర గ్రామాల రైతులు రుద్రవరం గ్రామంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా కేసీ కెనాల్ క్రింద ఉన్న ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న, మినుములు, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేశామని తెలిపారు. పొలాలకు చివరి తడి నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్తో ఫోన్ ద్వారా మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఈఈ ప్రతాప్ పాములపాడు మండలం మీదుగా అలగనూరు రిజర్వాయర్‌కు వెళ్లే కాల్వకు నీటి విడుదలకు అంగీకరించి నీటిని విడుదల చేయించారు. దీంతో పాములపాడు మండలానికి చెందిన రైతులు కురువ రమేష్, గాండ్ల సాయి, కురువ వెంకటేశ్వర్లు, హనుమంతు, మల్లికార్జున, ఈశ్వరయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #KC Canal #FarmersIssue #ByreddyRajasekharReddy #Pamulapadu #AndhraPradeshNews #Agriculture #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube