లోకల్ రైలును ఆపి ఇంజన్‌కు విశ్వకర్మ పూజలు
జాతీయం
జాతీయం
పశ్చిమ బెంగాల్: విశ్వకర్మ పూజ సందర్భంగా కొందరు గ్రామస్థులు పట్టాలపై నిలబడి నడుస్తున్న లోకల్ రైలును ఆపిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైలును ఆపిన అనంతరం గ్రామస్థులు ఇంజన్ వద్ద విశ్వకర్మ పూజలు నిర్వహించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఏ పరిస్థితుల్లో జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నడుస్తున్న రైలును పట్టాలపై నిలబడి ఆపి పూజలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే భద్రతా నిబంధనల దృష్ట్యా ఇలాంటి ఘటనలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.