BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
25 May, 2026 - 05:52 PM
296 వీక్షణలు

జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ యశ్వంత్ తోడేటి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ప్రముఖ చర్మ వైద్య నిపుణుల నుంచి ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల మే 31 వరకు ఉచిత ఓపీ వైద్య సేవలను నిర్వహిస్తున్నట్లు ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, ఉత్తమ చర్మ వైద్యుల అవార్డు గ్రహీత డాక్టర్ యశ్వంత్ తోడేటి తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న చర్మ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా సోరియాసిస్, స్కిన్ అలెర్జీలు, బొల్లి, తామర, గజ్జి, మొటిమలు, చుండ్రు, నల్లబొంగు, పులిపిర్లు, అనేలు వంటి వివిధ రకాల చర్మ వ్యాధులకు నిపుణుల సలహాలు, చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు.అలాగే హెయిర్ లాస్ సమస్యలతో బాధపడుతున్న వారికి అడ్వాన్స్డ్ పీఆర్‌పీ చికిత్స, డెర్మాపెన్ ట్రీట్‌మెంట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించిన సలహాలు అందించనున్నట్లు చెప్పారు. చర్మంపై వచ్చే ముడుతలు తొలగించేందుకు స్కిన్ గ్లో ట్రీట్‌మెంట్లు, అవాంఛిత రోమాల తొలగింపు, చర్మంపై గుంతలు మరియు మచ్చలను తగ్గించే ఆధునిక చికిత్సలపై కూడా ప్రత్యేక సూచనలు అందించనున్నట్లు వెల్లడించారు.

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉచిత ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స పొందాలని డాక్టర్ యశ్వంత్ తోడేటి కోరారు.