BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 09 July 2026, 09:01 pm
Posted by : కూనురు మధు

కోతులు, కుక్కల బెడద నివారించాలి అని బిఆర్‌ఎస్ వినతి పత్రం అందజేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Jul, 2026 - 09:01 PM
140 వీక్షణలు

చిట్యాల పట్టణంలో రోజురోజుకూ మితిమీరిపోతున్న కోతులు, వీధి కుక్కల బెడదను తక్షణమే నివారించాలని కోరుతూ చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు బిఆర్‌ఎస్  పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు గురువారం  వినతిపత్రాన్ని సమర్పించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో కోతులు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చొరబడి ఆహార పదార్థాలను ధ్వంసం చేయడమే కాకుండా, ప్రజలపై దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ​మరోవైపు వీధి కుక్కల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయిందని, రాత్రి వేళల్లో ప్రజలను వెంటాడటం, కుక్క కాట్ల ప్రమాదాలు పెరగడం వల్ల ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని వారు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు . ​కోతుల బెడద నివారణ: సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని కోతుల బెడదను అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టాలి అని,  వీధి కుక్కల జనాభా నియంత్రణ (స్టెరిలైజేషన్), టీకాలు మరియు ఇతర అవసరమైన చర్యలను వేగవంతం తీసుకోవాలన్నారు  ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

​ఈ సమస్యలను త్వరగా పరిష్కరించని యెడల బిఆర్‌ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో వైస్ చైర్మన్ మండే సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్  కూరెళ్ళ లింగస్వామి మాజీ కౌన్సిలర్  జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిల శివశంకర్ రెడ్డి,2 వార్డ్ కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ మరియు BRS పార్టీ 9 వార్డు ఇన్చార్జ్ ఆగు అశోక్ యాదవ్, బోలుగూరి సైదులు,  ఉప్పలపల్లి సైదులు, తోటకూరీ అనీల్, కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు