BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 July 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడూరులో 1116 శివలింగాల ఆలయంలో వైభవంగా అన్నాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 06:45 PM
57 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని కాత్యాయనీ సమేత జీవన ముక్తేశ్వర స్వామి వారి ఆలయం (1116 శివలింగాల ఆలయం)లో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఇంద్రగంటి దుర్గాప్రసాద్ శర్మ వేదమంత్రాల నడుమ జీవన ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అనంతరం శివలింగానికి ఘనంగా అన్నాభిషేకం చేశారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి, స్వామి, అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.

శివలింగానికి అన్నాభిషేకం చేయడం వల్ల లోకంలో ఆహార సమృద్ధి కలిగి, పంటలు బాగా పండుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.