BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్‌షిప్‌లు

తెలంగాణ
/ తెలంగాణ / ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 06:45 PM
62 వీక్షణలు

మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్‌షిప్‌లు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మడుపల్లి:

పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ మడుపల్లి పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ మధిర శాఖ ఆధ్వర్యంలో నగదు స్కాలర్‌షిప్‌లను బుధవారం అందజేశారు.

గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థినులను గుర్తించి ఈ స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నరసింహారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్ బాబ్జి హాజరై విద్యార్థినులకు స్వయంగా నగదు పురస్కారాలను అందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఇలాంటి స్కాలర్‌షిప్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న కెనరా బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థినులు:

మేడా వైష్ణవి – 10వ తరగతి – రూ.5,000

మోదుగు సంజన – 9వ తరగతి – రూ.5,000

యేసుపోగు షారోన్ – 8వ తరగతి – రూ.5,000

జక్కి అక్షయ – 7వ తరగతి – రూ.3,000

కనకపూడి నిహారిక – 6వ తరగతి – రూ.3,000

యేసుపోగు సవిత – 5వ తరగతి (పీఎస్ మడుపల్లి) – రూ.3,000

స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్‌కు, బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.