BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 18 August 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:17 PM
68 వీక్షణలు

మధిరలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మధిర గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.

పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి, ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గాలి ప్రసాద్ గౌడ్, వంగాల చంద్రన్న గౌడ్, మరీదు పరమయ్య గౌడ్, వంగూరి అజిత గౌడ్, తోట రూపస్ గౌడ్, సువర్ణ కంటి సూర్య చందర్ గౌడ్, ఇ. రామకృష్ణ గౌడ్, ఇ. ధనుష్ గౌడ్, పి. రాజేష్ గౌడ్, పి. హరికృష్ణ గౌడ్, ఇటికాల అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.