BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 01 August 2026, 07:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:09 PM
53 వీక్షణలు

మధిరలో మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు

ఖమ్మం జిల్లా, మధిర: మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో మధిర జూనియర్ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మధిర టౌన్ ఎస్సై కిషోర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

యువతే దేశ భవిష్యత్తని, క్షణిక ఆనందం కోసం మత్తు పదార్థాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి చదువు, క్రీడలు, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సీనియర్ నాయకుడు ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలను గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి తన స్నేహితులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని కోరారు.

న్యాయవాది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలపై చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయని తెలిపారు. ఒక తప్పు నిర్ణయం జీవితాంతం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, చట్టాలను గౌరవించే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.

డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. గుండె, మెదడు, కాలేయం వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించి, ఆరోగ్యవంతమైన జీవితం కోసం వ్యాయామం, పోషకాహారం, క్రమశిక్షణ అవసరమని తెలిపారు.

జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ లత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో "మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం" అనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, మహాత్మా గాంధీ శాంతి సేన సభ్యులు పాల్గొన్నారు.