BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 25 March 2026, 11:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:29 PM
167 వీక్షణలు

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి  నాణ్యతలో చిన్న లోటు ఉన్నా చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి, మార్చి 25: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో భోజనం చేస్తూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారో, భోజనం నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజనం పట్ల విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘డొక్కా సీతమ్మ’ పేరుతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతిరోజూ మధ్యాహ్న భోజన నాణ్యతను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశీలించాలని ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. భోజన నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత ఐదేళ్లలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల భర్తీని కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధిపాము శారద, విద్యా కమిటీ చైర్మన్ కంచిర్ల అంజయ్య, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.