BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 08 February 2026, 05:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు

తెలంగాణ
08 Feb, 2026 - 05:58 AM
303 వీక్షణలు
పుంగనూరు మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని, పుంగమ్మ చెరువు నీటితో నిండడంపై హర్షం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు సోమవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వనమలదిన్ని గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాల ద్వారా పుంగమ్మ చెరువు నిండడం పుంగనూరు ప్రజలకు ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కీలక జల ప్రాజెక్టు అమలుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు పుంగనూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నేతిగుట్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గడ్డూరి వెంకటరమణ తండ్రి గడ్డూరి లక్ష్మణ మృతికి సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యదు శేఖర్ నాయుడు, సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, మధుసూదన్ రాయల్, మోహన్ నాయుడు, సుబ్రమణ్యం రాజు, నాగరాజు, శివకుమార్, రాధాకృష్ణం నాయుడు, రఘుపతి నాయుడు, వెంకటేష్, దాము తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #TempleFestival #HandriNeeva #IrrigationDevelopment #CommunityPrograms #TDP #Condolences Follow us on Website Facebook Instagram YouTube