BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 08:09 am
Posted by : కూనురు మధు

జర్నలిస్టులపై కేసుల విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

జాతీయం జాతీయం
22 Aug, 2026 - 08:09 AM
128 వీక్షణలు

మీడియా స్వేచ్ఛకు బలం.. జర్నలిస్టులపై కేసుల విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ సమాచారం వైరల్ అవుతోంది. పెన్ను, కెమెరా పట్టుకుని ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై వార్తలు రాసే లేదా ప్రసారం చేసే జర్నలిస్టులపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకులు, అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తులు, ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారి వ్యవహారాలను వాస్తవాల ఆధారంగా వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయకూడదని కోర్టు హెచ్చరించినట్లు ఆ ప్రచారంలో పేర్కొంటున్నారు. అలాగే శాటిలైట్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ న్యూస్‌ ఛానళ్లు, ప్రింట్‌ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన వివాదాలు, కేసులను జర్నలిస్టు సంఘాల ద్వారా పరిష్కరించుకునే హక్కు ఉందని, ఏడు రోజుల్లో సంబంధిత సంఘాలు నిర్ణయం తీసుకోవచ్చని కూడా ప్రచారంలో ఉంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసే పోలీసు అధికారులపై చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే, ఈ ప్రచారంలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు లేదా అధికారిక ఉత్తర్వుల వివరాలు నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి అధికారిక కోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను ఖచ్చితమైన వార్తగా ప్రచురించడం సముచితం.