BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 25 August 2026, 07:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళల భద్రతకు పెద్దపీట..

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:12 AM
68 వీక్షణలు

మహిళల భద్రతకు పెద్దపీట.. తిరుపతిలో ఆధునిక మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం

రూ.2.75 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మాణం.. ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత

బాధిత మహిళలకు భరోసా కల్పించేలా ప్రత్యేక కౌన్సిలింగ్ గదులు ఏర్పాటు

ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణే లక్ష్యం

తిరుపతి పోలీస్ కమిషనరేట్ అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలన

తిరుపతి, ఆగస్టు 24:

మహిళలు, బాలికల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుపతి ఎం.ఆర్.పల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఎస్పీ కార్యాలయం సమీపంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను మంత్రులు పరిశీలించారు. మహిళలు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా చెప్పుకునేలా ప్రత్యేక గదులు, కుటుంబ సమస్యల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిందని హోంమంత్రి తెలిపారు. తిరుమల–తిరుపతికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, ముఖ్యంగా మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు అవసరమన్నారు.

కుటుంబ కలహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్న అనిత, కుటుంబ సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించే దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్‌లో అవగాహన కల్పించే చిత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ విధానాలతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతోందన్నారు.

తిరుపతి నగర ప్రాధాన్యం, పెరుగుతున్న జనాభా, భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అనిత తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.