BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 25 August 2026, 07:12 am
Posted by : RAYI SREENIVASU

సామాజిక శంఖారావం — ఆగస్టు 24 కలెక్టరేట్ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
25 Aug, 2026 - 07:12 AM
62 వీక్షణలు

సామాజిక శంఖారావం — ఆగస్టు 24 కలెక్టరేట్ ధర్నా

విజయనగరం :- వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘం (ఎపివిడబ్ల్యు) విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో "కుల వివక్ష లేని సమాజం కోసం" నినాదంతో ఆగస్టు 24న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. దళిత, గిరిజన వాడల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు.

ధర్నాలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ నరసింగరావు, తమ్మినేని సీతారాం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాంబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సారిపల్లి గ్రామానికి సంబంధించిన PAF (ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల) ప్యాకేజీని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సారిపల్లి మాజీ సర్పంచ్ రాయి విభీషణరావు మాట్లాడుతూ, గ్రామం నుండి 1,398 కుటుంబాలను PAF కింద గుర్తించి, ఆర్&ఆర్ కమిషనర్‌కు నివేదిక పంపించామని, దానికి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. అయితే ఎన్నికలు మొదలయ్యే లోపు ఈ ప్యాకేజీ ఖరారు కావాల్సి ఉన్నా, తమ గ్రామానికి PAF విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకుముందు కూడా ఇదే గ్రామం కోసం సీపీఎం నాయకులు, గ్రామ ప్రజలు గ్రామం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నా నిర్వహించిన సంగతిని రాయి విభీషణరావు గుర్తు చేశారు. మళ్ళీ అదే పరిస్థితి రాకూడదని, ఇప్పటికే సిద్ధమైన నివేదికను వెంటనే ముందుకు పంపి సారిపల్లి గ్రామ PAF సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ లో ఆయన కోరారు.

ప్రధాన డిమాండ్లు:

కోనేరు రంగారావు, పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి రక్షణ కల్పించాలి

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలి

22 'ఏ' నిషేధిత జాబితా నుండి ఎస్సీ, ఎస్టీ భూములను తొలగించాలి

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి

మెజారిటీ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి

జిల్లాలో వి.టి.డి.వి ఏర్పాటు చేయాలి

శ్మశాన వాటిక స్థలాలు కేటాయించి వసతులు కల్పించాలి

భూములు పంచాలి — సాగు భూములకు పట్టాలివ్వాలి

దళిత, గిరిజన వాడల్లో కనీస వసతులు కల్పించాలి

సామాజిక భవనాలు నిర్మించాలి

సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి

గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారికి పట్టాలివ్వాలి

వృద్ధ కళాకారుల పెన్షన్ సమస్యలు పరిష్కరించాలి

సారిపల్లి గ్రామంలోని 1,398 కుటుంబాలకు PAF ప్యాకేజీని వెంటనే ఖరారు చేయాలి

ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిచో మరింత ఉధృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.