BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 25 August 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేగి లింగేశ్వర స్వామి చెరువు ఆధునీకరణకు శ్రీకారం....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:48 AM
69 వీక్షణలు

వేగి లింగేశ్వర స్వామి చెరువు ఆధునీకరణకు శ్రీకారం.. చింతలపూడి పట్టణ సుందరీకరణపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దృష్టి

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి పట్టణ సుందరీకరణలో భాగంగా వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్టను ఆధునీకరించే ప్రక్రియకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సోమవారం శ్రీకారం చుట్టారు.

ఆదివారం సాయంత్రం వాటర్ ఫౌంటెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన సభలో వేగి లింగ చెరువును ఆధునీకరిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే, 24 గంటల్లోపే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువు అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు కట్టను సుందరీకరించి పట్టణానికి ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

అలాగే పట్టణంలో ఉన్న అన్ని విగ్రహాలను ట్యాంక్ బండ్ తరహాలో ఒకే ప్రాంతానికి తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీని ద్వారా పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

చింతలపూడి అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.