BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 May 2026, 12:08 pm
Posted by : కూనురు మధు

మిత్రుడి కుటుంబానికి అండగా పదవ తరగతి బ్యాచ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
11 May, 2026 - 12:08 PM
337 వీక్షణలు

NTIDAY NEWS చిట్యాల  

అకాల మరణం చెందిన తమ తోటి మిత్రుడి కుటుంబానికి పాత విద్యార్థులు అండగా నిలిచారు. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేష్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న అతని పాఠశాల మిత్రులు SSC 2006-2007 బ్యాచ్ స్పందించి తమ వంతు సాయాన్ని అందించారు.

​సోమవారం నాడు బాధితుడి నివాసానికి చేరుకున్న మిత్ర బృందం, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అందరూ కలిసి పోగు చేసిన రూ. 56,000 నగదును ఆర్థిక సహాయం రూపంలో వెంకటేష్ కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తమ తోటి మిత్రుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ నిధిని సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాము యాదవ్, ఊట్కూరి రమేష్, మాచర్ల యాదగిరి, ఆవనగంటి ఆంజనేయులు, తోటకూర మహేష్, మైల వేణు, ఆవనగంటి గణేష్ తదితర మిత్రులు పాల్గొన్నారు.